పవన్ కళ్యాణ్ ను సీఎం చేసిన ఎంపీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సభ జరిగింది. ఈ సభలో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ పురందీశ్వరి తన ప్రసంగంలో తడబడ్డారు.
ఎంపీ పురంధేశ్వరి తన ప్రసంగంలో భాగంగా ప్రముఖుల పేర్లు చెబుతూ.. ‘ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు, పెద్దలు, సోదరులు పవన్ కళ్యాణ్ గారికి’ అని ఆమె చెప్పారు.
దీంతో అభిమానులంతా కేకలు వేయడంతో పొరపాటు గ్రహించి డిప్యూటీ సీఎం అని ఆమె సరిదిద్దుకున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.