మహేష్-వెంకటేష్.. మరోసారి అన్నదమ్ములుగా
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-24’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-24’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను రీసెంట్గా గుట్టు చప్పుడు కాకుండా చేసిన విషయం విదితమే.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ క్యారెక్టర్లొ మలయాళ స్టార్ పృధ్వీ రాజ్ సుకుమారన్ నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకు అన్నగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాంబోలో ఇప్పటికే వచ్చిన‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



