మహేశ్ బాబుకు నోటీసులు

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సూపర్ స్టార్ , స్టార్ హీరో మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. హీరో మహేశ్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు.
తమ వెంచర్ కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి అంటూ హీరో మహేశ్ బాబు ఫోటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్ లో 34.80 లక్షల రూపాయలను పెట్టి స్థలం కొన్నాం అని ఇద్దరు వినియోగదారుల కమిషన్ కు పిర్యాదు చేశారు.
లేఔట్ లేకపోవడంతో డబ్బులు ఇవ్వమంటే ఆ సంస్థ పదిహేను లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చిందని ఆ పిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో కమిషన్ ఈరోజు సోమవారం హీరో మహేష్ బాబు తో పాటు సంస్థను కమిషన్ ముందు విచారణకు హజరు కావాలని ఆదేశించింది.