హీరో మహేశ్ ఆస్తులు ఎంతో తెలుసా..?

పల్లవి, వెబ్ డెస్క్ : వరుస సినిమాలతో పాటు విజయాలతో నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. నేడు మహేశ్ యాబై బర్త్ డే.ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రహీరోగా మారారు మహేశ్. తొలి సినిమాకు రాజకూమ్రుడుకి కేవలం కోటి రూపాయలు మాత్రమే రెమ్యూనేషన్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం ఒక సినిమాకు వంద కోట్ల రూపాయల రెమ్యూనేషన్ తీసుకునేస్థాయికి ఎదిగారు.
ఇప్పటివరకూ రీమేక్ చేయని ఏకైక హీరోగా మహేశ్ కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో మహేశ్ బాబు ఆస్తుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. హీరో మహేష్ బాబు కు మొత్తం ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఆస్తులున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో యాబై కోట్ల విలువ చేసే ఇల్లుతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫామ్ హౌస్ లున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
పూణే, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో హీరో మహేశ్ కు కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు టీటౌన్ లో వార్త. మహేష్ బాబు బెంజ్ కారు దగ్గర నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు అన్ని రకాల కార్లున్నాయని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటారు. అయితే మహేష్ బాబు కొన్ని వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తూ సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.