వైరల్ అవుతోన్న చిరు ట్వీట్ ..!

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈరోజు శనివారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ అభిమానులు, కృష్ణ అభిమానులు తమ అభిమాన హీరో మహేశ్ బర్త్ డే వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సినీ రాజకీయ క్రీడా రంగాలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
తన సోషల్ మీడియా ఎక్స్ చిరుట్వీట్స్ అనే హ్యాండిల్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘ తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచిన మీరు , మీ అసాధారణ ప్రతిభ, ఆకర్శించే గుణంతో పాటు అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. క్యాలెండర్ లో ఏడాది మారుతున్న ప్రతిసారి మీరు మరింత అందంగా , ఇంకా యవ్వనంగా మారుతున్నారు. ఈ ఏడాది కూడా మీకు సంతోషం , విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన ఏడాది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ‘ పేర్కొన్నారు.