ప్రియాంక చోప్రా.. జామకాయల కథ
ప్రియాంక చోప్రా.. జామకాయల కథ
పల్లవి, వెబ్ డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు జామకాయలు అమ్మే మహిళ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం #SSMB29గా భారీ బడ్జెట్తో రూపొందుతోంది. గత 15 రోజులుగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ వచ్చింది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ పూర్తికావడంతో నటీనటులను చూసేందుకు అక్కడి అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్ అయిపోవడంతో ప్రియాంక చోప్రా న్యూయార్క్ బయలుదేరింది. ఇక తాజా పోస్ట్ లో షూటింగ్ లొకేషన్స్, దారి పొడవు అందాలు అన్నింటిని చిత్రీకరించి షేర్ చేసింది. ఒడిశా కోరాపుట్ నుంచి వైజాగ్ వరకు కార్ లో వచ్చి వైజాగ్ టు ముంబై, ముంబై టు న్యూయార్క్ వెళుతున్నట్టు ప్రియాంకచోప్రా చెప్పుకొచ్చింది.
అలాగే దారిలో జరిగిన విషయాన్ని వివరించింది. జామకాయలు అమ్మే ఒక మహిళా తన వద్ద ఉన్న కాయలు150 రూపాయలు అని చెప్తే 200 ఇచ్చి చిల్లర ఉంచుకోమంటే చిల్లర లేకపోవడంతో ఇంకొన్ని కాయలు ఇచ్చింది. వర్కింగ్ ఉమెన్ ఛారిటీ కదా డబ్బులు తీసుకోరు అంటూ ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇక ఒడిశా నుంచి వైజాగ్ దారిలో వస్తుండగా పక్కన కాలువలు, పొలాలు, రోడ్లు, షూటింగ్ సెట్ లో తీసుకున్న ఫొటోలు, వీడియోలు అన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రాజమౌళి మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికనా లేదంటే కీ రోల్ పోషిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదు.



