మహేష్- రాజమౌళి సినిమా.. సంవత్సరంలోనే
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ అవలేదు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ అవలేదు. దీంతో ఈ సినిమా కోసం ఇండియన్ సినీ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
తాజాగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ మహేష్-రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుంది అని రామ్ చరణ్ ను అడిగింది. దానికి సమాధాణంగా రామ్ చరణ్ “కోవిడ్ లాంటివి లేకపోతే మరో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో విడుదల అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



