త్వరలో రామ్ చరణ్ తో ‘ సూపర్ హిట్ ‘ మూవీ తీస్తాం – దిల్ రాజు
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డ్యూయల్ పాత్రలో తెరకెక్కిన మూవీ గేమ్ చేంజర్.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో దీని గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ” ఈ ఏడాది ఓ వెలితి ఉంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో త్వరలోనే సూపర్ హిట్ మూవీ తీస్తాము. దీనికి సంబంధించిన కథ చర్చ అన్ని పనులు పూర్తయ్యాయి. ఆయనతో సూపర్ హిట్ మూవీ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే ప్రకటిస్తాము అని ” తెలిపారు.



