సింహాన్ని లాక్ చేసిన జక్కన్న.. ఎట్టకేలకు స్టార్ట్ చేశారు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చింది. మహేష్-రాజమౌళి షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌలే ఇచ్చాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ రానే వచ్చింది. మహేష్-రాజమౌళి షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌలే ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరో మహేష్ బాబుని లాక్ చేసానని.. పాస్ పోస్ట్ చూపిస్తూ ఫోటోకి ఫోజిచ్చాడు. ఇంకో హైలెట్ ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా కన్ఫామ్ అయ్యింది.
ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది అంటూ రాజమౌళి పోస్ట్ కింద ఆమె కామెంట్ పెట్టడంతో ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. ఇక అదే పోస్ట్ కి మహేష్ కూడా “ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను” అనే డైలాగ్ ను రిప్లయ్ గా ఇచ్చాడు. దీంతో రాజమౌళి చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న తెరకేక్కించబోతున్నాడు. సౌతాఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం.



