రాజమౌళి-మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ లెవల్ కి వెళ్లిన రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో మహేష్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ లెవల్ కి వెళ్లిన రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో మహేష్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి హీరోయిన్ ను సెట్ చేద్దాం అనుకున్నారట మేకర్స్. కానీ, ప్రియాంక చోప్రా అయితే ఇంటర్నేషనల్ వైడ్ కూడా క్రేజ్ వస్తుంది అని భావిస్తున్నారట.



