క్రేజీ అప్డేట్.. రాజమౌళి-మహేష్ సినిమాలో జాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. ఈ ఫ్యాన్ వరల్డ్ చిత్రంలో ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ చేరాడు. ఆ స్టార్ మరెవరో కాదు బాలీవుడ్ నటుడు ‘ధూమ్’ మూవీ ఫేమ్ జాన్ అబ్రహం.
రాజమౌళి-మహేష్ సినిమాలో విలన్ పాత్ర కోసం జాన్ ను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే సంప్రదింపులు కూడా ఆయయ్యని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని ఫిలిం నగర్ టాక్. ఇక మహేష్ సినిమాలో జాన్ అబ్రహం చేస్తున్నాడని తెలియడంతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. మరి ఈ సినిమాలో జాన్ తన నటనతో ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా 2026 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.



