గుడ్ న్యూస్.. జనవరిలో షురూ
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలవలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపధ్యంలోనే రాజమౌళి-మహేష్ బాబు సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలుకానుందట. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.



