Zainab Ravdjee : అఖిల్‌కు కాబోయే భార్య.. మాజీ సీఎం జగన్‌కు దగ్గరి చుట్టం !
Zainab Ravdjee : టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్జీ అనే యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాగా ఆమె ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా ఆమె ఆర్టిస్ట్ అని వార్తలొస్తున్నాయి
Zainab Ravdjee : టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్జీ అనే యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కాగా ఆమె ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా ఆమె ఆర్టిస్ట్ అని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లను ఆమె ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఇండియాతో పాటు దుబాయ్, లండన్‌లో పెరిగినట్లు సమాచారం. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ బిజినెస్‌మ్యాన్.
ఈయన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అలాగే జగన్, నాగార్జునల ఫ్యామిలీలతో కూడా దగ్గరి సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈయన కుమారుడు జైన్ రవ్జీ కూడా వ్యాపారవేత్తే. జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న ఈ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది కాగా 27ఏళ్ల జైనాబ్‌తో అఖిల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట.
డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో శోభితా ధూళిపాళతో నాగ చైతన్య వివాహానికి కుటుంబం సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండగా, అఖిల్‌ది కూడా అదేరోజున అదే వేదికపై జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల వివాహాలు ఒకేరోజున, ఒకే వేదికపై జరిగితే ఫ్యాన్స్‌కు కనుల పండుగే.



