పవన్ కళ్యాణ్ గురించి జగన్ కీలక నిర్ణయం.!
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడానికి, వైనాట్ 175 నుంచి 11 స్థానాలకు వైసీపీ పరిమితం అవ్వడానికి, మహా మహా నాయకులే ఓడిపోవడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ విశ్లేషకులు పలు విశ్లేషణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పలు సమీక్ష సమావేశాల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. వైసీపీ, జనసేన నాయకుల మధ్య ఇప్పటికీ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు మూవీపై వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు #DisasterHariHaraVeeraMallu అనే యాష్ ట్యాగ్ తో వీరమల్లు మూవీని ఓ ఆట ఆడుకున్నారు. అట్నుంచి జనసైనికులు సైతం వైసీపీ దాడిని తిప్పికొట్టారు. అయినా కానీ మూవీ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే , తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గురించి కానీ అతని విషయాల గురించి స్పందించవద్దు అని వైసీపీ శ్రేణులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో కాపు, బలిజ ఓట్లు వైసీపీకి పడకపోవడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు చేసిన దాడినే కారణం అని వైసీపీకి చెందిన కాపు, బలిజ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో ఓటమికి కారణమైన పవన్ కళ్యాణ్ ను ఎన్నికల తర్వాత ప్రతి రోజూ నిత్యం పవన్ కళ్యాణ్ పై అటాకింగ్ చేయడం తమ సామాజిక వర్గాల్లో వైసీపీకి, తమకు మైనస్ అవుతుందని వాపోయినట్లు టాక్. అందుకే జనసేన గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దు అని జగన్ ఆదేశించారు.
మాజీ మంత్రి రోజా లాంటి ఒకరిద్దరూ కాకుండా మిగతా ఎవరూ కూడా స్పందించొద్దు అని జగన్ చెప్పారట. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సినిమా హిట్ కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసినా కానీ అది కాస్త మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి అంబటి రాంబాబు కావాలనే పరోక్షంగా సినిమా గురించి సెటైర్లు వేశారని నెటిజన్లు రిప్లయ్స్ ఇవ్వడం.. విడుదలైన సినిమా మిక్స్ డ్ టాక్ రావడంతో అంబటి రాంబాబు సైతం జనసైనికులకు టార్గెట్ అయ్యారు.



