పవన్ మాస్ వార్నింగ్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ శ్రేణులను ఉద్ధేశించి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” ఐదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ చేసిన అరాచకాలే ప్రస్తుతం చేస్తుంది.
గొంతు కోస్తామనే బెదిరింపులకు , తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని” ఆయన స్పష్టం చేశారు. ‘ శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదు.
చట్టబద్ధంగా అందరూ వ్యవహారించాలి కాబట్టి చాలా పద్ధతిగా ఉన్నాము. ఎన్నో దెబ్బలు తిని ఇక్కడి వరకు వచ్చాము. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామని ” మాస్ వార్నింగ్ ఇచ్చారు.



