అక్కినేని వారసుడికి శ్రీలీల షాక్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ బ్యూటీ .. హీరోయిన్ శ్రీలీల అక్కినేని వారసుడికి షాకిచ్చింది. టాలీవుడ్ మన్మధుడు , స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అయిన అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘లెనిన్’.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ను ఎంపిక చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు ఫిల్మ్ వర్గాలు పేర్కొన్నాయి. సినిమా షూటింగ్ కు శ్రీలీల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మరో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
భాగ్య శ్రీ బోర్సే ను తీసుకున్నట్లు సమాచారం. అయితే, హాట్ బ్యూటీ శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ మూవీలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ , మాస్ జాతర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు.