సంయుక్త చూపు.. బీటౌన్ వైపు
మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘బీమ్లా నాయక్’తో సంయుక్త టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.

మలయాళం, తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘బీమ్లా నాయక్’తో సంయుక్త టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాలీవుడ్ కంటే తెలుగులోనే వరుస ఆఫర్లు దక్కించుకుంది. ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సంయుక్త చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్వయంభూ’లో ఆమే హీరోయిన్. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వస్తున్న ‘రామ్’లో సంయుక్త నటిస్తోంది. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ‘సార్’, ‘విరూపాక్ష’ ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఈ అమ్మడు చెబుతోంది. అయితే, సంయుక్త మీనన్ ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చరణ్ తేజ్ డైరెక్షన్ లో వస్తున్న ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’లో మోహిని పాత్రలో సంయుక్త యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్, ప్రభుదేవా యాక్ట్ చేస్తున్నారు. వీరిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉందని సంయుక్త చెప్పుకొచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సంయుక్తకు ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. 3 మిలియన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు.