లక్కీ ఛాన్స్ కొట్టేసిన సంయుక్త మీనన్..!
పల్లవి, వెబ్ డెస్క్ : కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో వచ్చిన బింబిసార, సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష, డెవిల్ లాంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, బ్యూటీ సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీ అయ్యారు.సంయుక్త మీనన్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి అఖండ -2 .
ఈ చిత్రంలో ఈ హాట్ బ్యూటీ కీలక పాత్ర పోషించడంతో పాటు ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నట్లు కూడా టాక్. త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయనున్నారని కూడా టీ టౌన్ లో వినిపిస్తున్న వార్తలు. దీనిపై చిత్రం యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తేజస్విని నందమూరి సమర్పణలో 14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యాజిక్ స్టార్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.



