టాలీవుడ్ కి బై.. బై.. నార్త్ లో సెట్
సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్గా ఈ అమ్మడుకి తరువాత కూడా మంచి అవకాశాలు వచ్చాయి.
సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్గా ఈ అమ్మడుకి తరువాత కూడా మంచి అవకాశాలు వచ్చాయి. కనీ విజయాలు మాత్రం వరించలేదు. దాంతో అవకాశాలు దక్కలేదు.అప్పటి నుండి టాలీవుడ్ న్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్ డేట్ ఇవ్వడానికి ఏడాది టైం తీసుకుంది. రీసెంట్లీ అడివి శేష్ డెకాయిట్‌కు కమిటయ్యింది.
నార్త్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన అమ్మడు అక్కడ బిగ్ ప్రాజెక్టులను బ్యాగ్ లో వేసుకుంటోంది. ఆమె చేతిలో ప్రజెంట్ ఐదు సినిమాలుంటే అందులో నాలుగు హిందీ నుంచి కావడం విశేషం. వరుణ్ ధావన్‌తో హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై, అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తుమ్ హీ హోలో నటించే గోల్టెన్ ఛాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఒక్కటే మూవీ చేస్తోంది. ఇది కూడా హిందీ, తెలుగులో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ లైనప్ చూస్తుంటే టాలీవుడ్‌కు మెల్లిగా దూరం జరుగుతున్నట్లు కనిపిస్తుంది.



