ధనుష్ తో డేటింగ్ పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ..!
Dhanush and Mrunal Thakur
పల్లవి, వెబ్ డెస్క్ : మృణాల్ ఠాకూరు సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ బ్యూటీఫుల్ హీరోయిన్. కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ గత కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు అని వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. డేటింగ్ రూమర్స్ పై తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు.
ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ” ధనుష్ తో ప్రేమలో , డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ధనుష్ కేవలం నాకు మంచి స్నేహితుడు మాత్రమే. తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని” హాట్ బ్యూటీ పేర్కొన్నది. అయితే గత కొంతకాలంగా పలు కార్యక్రమాల్లో హీరో ధనుశ్ , మృణాల్ కలిసి కన్పించడంతో వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది. వీరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరి ముఖ్యంగా ఇటీవల జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ స్క్రీనింగ్ కు ధనుశ్ హజరు కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనిపై కూడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్లారిటీస్తూ సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్ర స్క్రీనింగ్ కార్యక్రమానికి ధనుశ్ ను అజయ్ దేవగణ్ గారు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకే హీరో ధనుశ్ వచ్చారు. దీన్ని ఎవరూ తప్పుగా ఆర్ధం చేసుకోవద్దు ” అని ఆమె కోరారు. అయితే ఈ సినిమా స్క్రీనింగ్ కార్యక్రమానికి ముందు జరిగిన తేరే ఇష్క్ మే సినిమా ర్యాప్ ఆప్ పార్టీకి కూడా మృణాల్ ఠాకూర్ హజరయ్యారు. ఈ రెండు సందర్భాలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇలాంటి వార్తలను పుట్టించారని మృణాల్ ఠాకూరు చెప్పుకొచ్చారు.



