మృణాల్ ఠాకూర్ కు బిపాషా బసు కౌంటర్..!
పల్లవి, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సీనియర్ స్టార్ హీరోయిన్ బిపాషా బసు ల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది.మృణాల్ ఠాకూర్ సిల్వర్ స్క్రీన్ లోకి ఎంట్రీ కాకముందు బుల్లితెరపై నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే తన బుల్లితెర (టెలివిజన్) కెరీర్ ప్రారంభంలో జరిగిన ‘కుమ్కుమ్ భాగ్య’ షూటింగ్ సమయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సహచర నటులతో కల్సి పాల్గొన్నచిట్ చాట్ ఇంటర్వూలో మాట్లాడుతూ ” బిపాషా బసు శరీరాకృతి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆమె మాట్లాడుతూ ” బిపాషా బసు కండలు పెంచి మగరాయుడిలా ఉంటుంది. అలాంటివారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా.. నువ్వు వెళ్లి బిపాషాని పెళ్లి చేసుకో .. ఆమె కంటే నేనే చాలా అందంగా ఉంటాను” అని వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ తన గురించి చేసిన వ్యాఖ్యలపై బిపాషా బసు తాజాగా పరోక్షంగా స్పందించారు. ‘ బలమైన మహిళలు మరొకరి ఉన్నతికి పాటుపడతారు. స్త్రీలంతా దృఢంగా ఉండాలి. అప్పుడే ఫిజికల్ గా , మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు. మహిళలు బలంగా ఉందొద్దనే పాత కాలం నాటి ఆలోచనల నుంచి బయటపడండి ‘ అని కౌంటరిచ్చింది.



