కనెక్ట్ కాలేకపోయాను.. బాత్రూమ్లోకి వెళ్లి ఏడ్చేవాడిని
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్. తనకు జరిగిన అవమానాలు తట్టుకోవడానికి బాత్ రూమ్ కి వెల్లో ఏడ్చేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్. తనకు జరిగిన అవమానాలు తట్టుకోవడానికి బాత్ రూమ్ కి వెల్లో ఏడ్చేవాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఆయన దుబాయిలో మంగళవారం జరిగిన ఓ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన నట ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా టార్గెట్ను చేరుకోవాలని మనం చేసే ప్రయాణం ఊహించనిది జరిగితే కుంగిపోవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. కొత్త ఉత్సాహంతో ముందుకువెళ్ళాలి. ఒకానొక సమయంలో నా సినిమాలు కూడా అనుకున్న విజయాన్ని సాధించలేదు. ఆ బాధను తట్టుకోవడానికి ఎవరికీ తెలియకుండా బాత్రూమ్లో ఏడ్చేవాడిని. ఆ బాధ నుంచి నేనే బయటకు వచ్చి విజయం కోసం మరింత శ్రమించా. ప్రపంచం మనకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కుట్రల వల్ల విజయం రావడం ఆగుతుంది అంటే నేను నమ్మను. ఆ సమయంలో నేనే ప్రేక్షకులకు కనెక్ట్కాలేకపోయా. అది నా తప్పే. గ్రహించా, విజయాలు అందుకోగలిగా. ప్రతీదానికి ఇతరులను నిందించకుండా అనుకున్నది చేసి సాధించి జీవితాన్ని ఆస్వాదించండి” అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్.



