మైథాలజీ కాన్సెప్ట్ తో ‘హైందవ’.. గ్లింప్స్ నెక్స్ట్ లెవల్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు మహేష్ చందు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందేమి. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు మహేష్ చందు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందేమి. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలైన ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘హైందవ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ చూస్తుంటే ఇదొక మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాలుగా అనిపిస్తుంది.
ఈ గ్లింప్స్ లో కొంతమంది దుండగులు ఓ గుడిని తగలబెడదాం అని చూస్తుంటే హీరో, ఓ వరాహం, ఓ సింహం వచ్చి కాపాడినట్టు చూపించారు. చివర్లో బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుమూర్తి దశావతారాలు చూపించారు. ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక ఈ వీడియోకి లియోన్ జేమ్స్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుదీర్ బైరెడ్డి నిర్మాణంలో మవస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది.



