ఫహాద్ తో యానిమల్ బ్యూటీ.. క్రేజీ ప్రాజెక్ట్
బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నాడు.
బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని ఫిక్స్ చేశారట మేకర్స్. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
కామెడీ బ్యాక్‌డ్రాప్ లో సాగే ప్రేమకథగా దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని టాక్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న తొలి హిందీ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Related News
-
అమెరికా రోడ్లకు దీటుగా ఆ ప్రాంతంలో రహదారులు
-
అలా చేస్తే ఫ్యూచర్ ఉండదు.. నెటిజన్ ప్రశ్నకు చై సూపర్ కౌంటర్
-
వేట మొదలెట్టిన జక్కన్న.. ఈసారి డిఫరెంట్ టైటిల్
-
ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. కన్నప్ప నుండి ప్రభాస్ లుక్ వచ్చేసింది
-
ఆయన ఒక లెజెండ్.. ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక



