బాధ్యత గల భాగస్వామిని.. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన రష్మిక
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కాకపోతే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఈజంట.

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. కాకపోతే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఈజంట. అయినా వారిద్దరి రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “ఈ ప్రపంచంలోనే అత్యంత అనందకరమైన ప్రదేశం మా ఇల్లు. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తూపోతుంటాయి. కానీ ఇల్లు ఇచ్చే ఆనందం శాశ్వతం. నేను ఎప్పటికీ ఓ బాధ్యత కలిగిన కుమార్తెను, సోదరిని, భాగస్వామిని కూడా. వీరి చుట్టూ కలబోసిన జీవితానికి నేను ఎంతో విలువిస్తాను” అని చెప్పుకొచ్చింది రష్మిక. కూతురు, సోదరి అనేవరకు బాగానే ఉంది కానీ, నువ్వెప్పుడూ భాగస్వామిని అయ్యావు రష్మిక అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.