ఓటీటీ లోకి ‘కుబేర’
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, మన్మధుడు అక్కినేని నాగార్జున , తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన తాజా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ నిర్మించగా సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈనెలలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ గురించి క్లారిటీచ్చారు చిత్రం యూనిట్. ఈ నెల పదిహేడో తారీఖు ఆర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నది. అమెజాన్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో 134కోట్ల రూపాయలను ఇప్పటివరకూ వసూళ్లు చేసింది.



