నా బలం అదే – రష్మిక మందన్న

పల్లవి, వెబ్ డెస్క్ : తన అందంతో పాటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదితో పాటు పాన్ఇండియా రేంజ్ లో అందరి అభిమానాన్ని చురగొన్న నేషనల్ క్రష్, పాన్ ఇండియాస్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. తనకు ప్రస్తుతం క్రేజ్, పేరు ప్రఖ్యాతల మధ్య తాను ఎలా ప్రశాంతంగా ఉంటున్నారో, తన మనసును ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారో, నిరంతర ప్రయాణాలతో పాటు బిజీ బిజీ షూటింగ్ ల హడావుడిలో మానసిక ప్రశాంతతను ఎలా కలిగి ఉంటున్నారో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ హాట్ బ్యూటీ బయటపెట్టారు.
మీడియాతో రష్మిక మందన్న మాట్లాడుతూ” తన బిజీ లైఫ్ లో మానసిక ప్రశాంతతకు, వాస్తవానికి దగ్గరగా ఉండటానికి ఒక అలవాటు ఎంతగానో సహాయపడుతుందని” తెలిపారు. తాను చేసుకున్న ఆ అలవాటే రోజూ డైరీ రాసుకోవడం అని రష్మిక మందన్న పేర్కొన్నారు. “నా చుట్టూ ఉన్న మనుషులే నా బలం. నా కుటుంబం, స్నేహితులు, నా టీమ్ నాకు అండగా నిలవడమే కాకుండా, నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుచేస్తూ నన్ను నేల మీద నిలబెడతారు” అని ఈ హాట్ బ్యూటీ తెలిపారు.
అభిమానుల గురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తావిస్తూ, “నేను చేసే పనిని గుర్తుచేస్తూ, మరింత ఉత్తమంగా పనిచేయడానికి నా అభిమానులు ఇచ్చే ప్రోత్సాహం ఎనలేనిది” అని చెప్పారు. కానీ కొన్నిసార్లు ఈ హడావుడి నుంచి కాస్త విరామం తీసుకోవడం చాలా అవసరమని రష్మిక అన్నారు. “కొన్ని రోజులు నాకు నేనే కాస్త ఆగమని, అన్ని విషయాల గురించి ఆలోచించుకోమని చెప్పుకుంటాను. అలాంటి సమయంలో డైరీ రాసుకోవడం నాకు బాగా ఉపయోగపడుతుంది. నా చుట్టూ ఏం జరుగుతున్నా, నా లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను స్థాపించిన ‘డియర్ డైరీ’ వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే” అని ఆమె వివరించారు.