రేపు కింగ్ డమ్ విడుదల – హీరో విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కింగ్ డమ్. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఎక్స్ లో ఒక భావోద్వేగ పోస్టు చేశారు. ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ పాత్ర పేరు సూరి.
సూరి పాత్రను మెన్షన్ చేస్తూ ట్విట్టర్ లో ‘సూరి (కింగ్ డమ్) నిండా ఆగ్రహంతో ఉన్నాడు. కానీ అభిమానుల ప్రేమ , కౌగిలింతలు. రేపు గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం’ అని తన పోస్టులో వీడీకే రాసుకొచ్చారు. ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కన్పించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.