ఈడీ విచారణకు రాలేను : రానా

పల్లవి, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో నటుడు రానా దగ్గుబాటి రానా ఈ నెల ఇరవై మూడో తారీఖున విచారణ కావాల్సి ఉంది. అయితే, తాను పెట్టుకున్న ముందస్తు సినిమా షెడ్యూల్ కారణంగా ఈరోజు బుధవారం ఈడీ ముందు విచారణకు రాలేనని లేఖ రాశారు.
దీనికి సంబంధించి హీరో రానా ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ కు నిన్న మంగళవారం సమాచారం అందించారు. కాగా రానా విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు ఆయనకు సమయం ఇచ్చారు. తర్వాత విచారణకు ఎప్పుడు రావాలనే అంశం గురించి త్వరలోనే సమాచారం ఇస్తామని ఈడీ తెలిపింది.
ఈ కేసులోనే ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈనెల ముప్పై తారీఖున హాజరు కావాలని నోటీసులు పంపింది. స్టార్ హీరో రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ ను వచ్చే నెల ఆగస్టు ఆరో తారీఖున, మంచు లక్ష్మీని ఆగస్టు పదమూడో తారీఖున విచారణకు హజరు కావాలని సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది.