ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జనవరి 26న ‘మాస్ జాతరే’
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను బోగ వరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నా ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, షార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను బోగ వరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నారు. క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నా ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, షార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ‘మాస్ జాతర’ చిత్రం నుంచి అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ విడుదల చేశారు. వింటేజ్ రవితేజ లుక్ లో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం ఆడియన్స్ లో అంచనాలు పెంచుతోంది. మరి చాలా కాలంగా సరైన హిట్ కోసం చేస్తున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



