శ్రీలీల చేయి పట్టుకొని లాగిన ఫ్యాన్.. ఆ తర్వాత..?
హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. షూట్ అనంతరం తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు అత్యుత్సాహం చూపించారు. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రీలీల ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ప్రేమ కథా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందు కోసం చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే కార్తిక్ వారికి అభివాదం చేసుకుంటూ ముందు నడవగా.. ఆ వెనుకే శ్రీలీల నవ్వుకుంటూ వచ్చారు. చుట్టూ బాడీగార్డులు వారిని సంరక్షిస్తున్నా.. గుంపులో నుంచి కొంతమంది ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లాగారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. వారిని విడిపించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఆమెను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Evadra aa laagesadu 🤣🤣🤣🤣🤣#SreeLeela pic.twitter.com/fd8citrIhz
— Radoo (@Chandan_radoo) April 6, 2025



