బ్యాడ్ న్యూస్.. రాబిన్ హుడ్ వాయిదా
యూత్ స్టార్ నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. కామెడీ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు అధికారిక నోట్ కూడా విడుదల చేశారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామంటూ తెలిపారు. దీంతో నితిన్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.