సీనియర్ నటుడుకి శ్రీలీల వార్నింగ్..!

పల్లవి, వెబ్ డెస్క్ : శ్రీలీల వరుస సినిమాలతో, వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ పోజిషన్ లో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్. సీనియర్ హీరోల దగ్గర నుంచి యువహీరోల వరకు అందర్నీ కవర్ చేస్తూ తనదైన శైలీలో ఇండస్ట్రీలో టాప్ పోజిషన్ లో కొనసాగుతుంది. ఈ హాట్ బ్యూటీకి ఎన్ని ప్లాపులు వచ్చినా కానీ తన క్రేజ్ ను మాత్రం రోజురోజుకి పెంచుకుంటూ ముందుకు సాగుతుంది.
ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇంటర్వూలు, టాక్ షోలలో ఈ ముద్దుగుమ్మ దర్శనమిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు, ఒకప్పటి స్టార్ హీరో జగపతిబాబు హోస్ట్ గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ఒక టాకో షోలో స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజా ఈ ఎపిసోడలో ముద్దుగుమ్మ శ్రీలీల గెస్ట్ గా హాజరు కాబోతుంది. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. జగపతిబాబు శ్రీలీల కౌంటర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. “మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం.. నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు” అని జగపతి బాబు అన్నారు.
దీనికి రిప్లయ్ గా శ్రీలీల “మీరు నన్ను పొగిడారా లేక తిట్టారా?” అని బాబును సూటిగా ప్రశ్నిస్తూ ఓ పంచ్ వేసింది. ఇంతలోనే..జగపతిబాబు ఆమె లుక్స్ గురించి ఒక టాపిక్ చెబుతానంటూ మాట్లాడగా, “ఆ టాపిక్ తెరపైకి వస్తే.. నేను మీ మేటర్ బయట పెడతా” అంటూ కౌంటర్ వేసింది శ్రీలీల. దీంతో జగపతి బాబు ఒక్కసారిగా షాక్‌కి గురవ్వగా, ఆ తర్వాత స్మైల్‌తో సర్దేశారు. “మీ హీరోయిన్ గారు.. మీరు ఒకరు” అంటూ సరదాగా హింట్ ఇచ్చిన శ్రీలీల మాటలు ఇంట్రస్ట్ పెంచేశాయి.