శ్రీలీల చేసిన పనికి అందరూ ఫిదా ..!

ఇటు అందం. అటు చక్కని డాన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల. సినిమాల్లో తన పెర్మారెన్స్ తో పాటు ఇటు నిజజీవితంలో చేసే మంచి పనులతో అందరి మన్ననలను పొందుతుంది ఈ ముద్దుగుమ్మ .
గతంలో గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను శ్రీలీల దత్తత తీసుకున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాపను దత్తత తీసుకున్నట్లు తెలుస్తుంది.
తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందనే ఆర్ధం వచ్చేలా తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో ఓ పోస్టు పెట్టారు. ఈ ఫోటోలో శ్రీలీల ఓ చిన్నారికి ముద్దు పెడుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.