వరుస ఫ్లాపులు – నితిన్ సంచలన నిర్ణయం..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువస్టార్ హీరో నితిన్ ఇటీవల ఏ సినిమా చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
తాను నటించిన వరుస రెండు మూవీస్ ఫ్లాప్ కావడంతో తాజాగా నితిన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నాడు.
ఈ సినిమాకు రెమ్యూనేషన్ తీసుకోకుండా నటించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నట్లు టాక్. అయితే, ఎల్లమ్మ మూవీ హిట్ అయితే తర్వాత డబ్బులు తీసుకోవాలని హీరో నితిన్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



