ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘మాస్ జాతర’టీజర్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. సామజవరగమన లాంటి సూపర్ హిట్ సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. సామజవరగమన లాంటి సూపర్ హిట్ సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే మాస్ జాతర సినిమా టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి చాలా కాలం తరువాత వింటేజ్ రవితేజ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.



