రవితేజ ఇంట తీవ్ర విషాదం..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు. హైదరాబాద్ మహానగరంలోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి ఆయన మరణించినట్లు హీరో రవితేజ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు స్వస్థలం ఏపీలోని జగ్గంపేట. ఆయన ఫార్మసిస్ట్ గా పనిచేశారు. ఆయనకు హీరో రవితేజ తో పాటు రఘు, భరత్ రాజు కుమారులు. భరత్ సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. రఘు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.



