రవితేజ “ఆవేశం”
మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ఆవేశం. గ్యాంగ్ స్టర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ఆవేశం. గ్యాంగ్ స్టర్ అండ్ కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అప్పటినుండి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మన మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ సినిమాను నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక తాజా కథనాలు ప్రకారం మాస్ రాజా రవితేజ ఆవేశం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి ఆవేశం సినిమా కథ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అందుకే ఆ సినిమా హక్కులను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆయన చేయడానికే తీసుకున్నాడా? లేదంటే కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 2025 మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.



