అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..రాదా?.. పెట్టిన సెక్షన్లు ఏంటీ?
సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.
సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ పై 2 సెక్షన్లలో కేసులు పెట్టారు చిక్కడిపల్లి పోలీసులు. బీఎన్ఎస్ 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద ఆయనకు 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే బీఎన్ఎస్ 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అర్జున్ను వైద్యపరీక్షల కోసం ఉస్మానియా తరలిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఈ కేసు రుజువైతే అర్జున్ కుల సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్ అల్లు అర్జున్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈనెల 11నే పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులకు కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే అత్యవసర పిటిషన్లు ఉ.10.30 గంటలకే జత చేయాలని, ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని పేర్కొంది. అయితే అప్పటివరకు అర్జున్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన లాయర్ కోరారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అల్లు అర్జున్ ఇంటికి భారీగా అభిమానులు భారీ స్థాయిలో చేరుకున్నారు. అభిమానులను పోలీసులు చెదరగొడుతున్నారు.



