అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం..!

పల్లవి, వెబ్ డెస్క్ : పాన్ఇండియా స్టార్ హీరో , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ప్రముఖ సీనియర్ లెజండ్రీ దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, హీరో అల్లు అర్జున్ నాయనమ్మ అయిన కనకరత్నం ఈరోజు కన్నుమూశారు.94ఏళ్ళ కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతూ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆర్ధరాత్రి దాటాక 1.45నిమిషాలకు కన్నుమూశారు.
ఈ విషయం తెలియడంతో ముంబైలో ఉన్న హీరో అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలు దేరారు. మరోవైపు మైసూరులో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా హైదరాబాద్ బయలు దేరారు. ఈరోజు హైదరాబాద్ లోని కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అరవింద్ తల్లి తన అత్తగారైన కనకరత్నం మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కనకరత్నం పార్ధివదేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి ” మా అత్తయ్య గారు కీ. శే. అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ , ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః ” అంటూ ఆయన ట్వీట్ చేశారు.