అల్లు అర్జున్ ను గుర్తుపట్టని భద్రతా సిబ్బంది..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఈ వార్త చదవడానికి వింతగా ఉన్న ఇదే నిజం. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని వాళ్లు, గుర్తు పట్టనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తన నటనతో , డాన్సులతో మోస్ట్ పాపులర్ అయ్యారు బన్నీ. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు.
తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్ పోర్టులో ఎంట్రీ పాస్ గేటు వద్ద భద్రతా సిబ్బంది హీరో అల్లు అర్జున్ ను ఆపేశారు. కళ్ల జోడు పెట్టుకుని ముఖానికి మాస్క్ ధరించి అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ముఖానికి , కళ్లకు అడ్డుగా మాస్క్, కళ్లజోడు ఉండటంతో ఎయిర్ పోర్టు సెక్యూరిటీ గుర్తుపట్టలేదు.
బన్నీ అసిస్టెంట్ వచ్చి ” ఆయన అల్లు అర్జున్ “, ఐకాన్ స్టార్ హీరో అని చెప్పినా ముఖం చూపించాల్సిందే అని సదరు సెక్యూరిటీ పట్టుబట్టారు. దీంతో చేసేది ఏమి లేక హీరో బన్నీ తన కళ్ల జోడు, మాస్క్ తీసి చూపించారు. ఆ తర్వాత సదరు సెక్యూరిటీ లోపలకు అనుమతిచ్చాడు. ఈ సంఘటనపై భద్రతాసిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెక్యూరిటీ తన పనిని తాను బాధ్యతగా చేశారు అని పొగడ్తల వర్షం కురిపించారు. హీరో అల్లు అర్జున్ సైతం ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ఓ సామాన్యుడిలా మాస్క్, కళ్ల జోడు తీసి చూపించడం అతని సింపుల్ సిటీకి నిదర్శనం అని నెటిజన్లు ఆ వీడియోను పోస్టు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.