ప్రముఖ నిర్మాత అరెస్ట్.!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ అయ్యారు. బుధవారం (ఆగస్టు 20) ఏపీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని అనంతరం విజయ వాడకు తరలించారు.
ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్ రూ.4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేశ్ అనేక సార్లు అడిగినా కిరణ్ పట్టించుకోలేదు.
ఈనెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేశ్, ఆయన సతీమణి వెళ్లారు. అయితే అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది మహేష్ దంపతులపై దాడి చేశారు. దీంతో దాసరి కిరణ్ పై విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు మహేశ్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాసరి కిరణ్ ను హైదరాబాదులో అరెస్టు చేసి విజయ వాడకు తరలించారు.