నాగార్జున గారూ ఈ మణికంఠను ఎలిమినేట్ చేయండి సార్… భరించలేకపోతున్నమ్
బిగ్ బిస్ 8వ సీజన్ మొదలైన రెండో రోజు నుంచే అసలైన ఆట స్టార్ట్ అయింది. తొలివారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్స్
బిగ్ బిస్ 8వ సీజన్ మొదలైన రెండో రోజు నుంచే అసలైన ఆట స్టార్ట్ అయింది. తొలివారం నామినేషన్స్ హీటెక్కిస్తున్నారు కంటెస్టెంట్స్ .. ఆరుస్తున్నారు.. . తిట్టుకుంటున్నారు. మొత్తానికి ఆడియన్స్ ను అయితే బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే కంటెస్టెంట్ నాగమణికంఠ ప్రవర్తనే హౌజ్ లోని సభ్యులకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది.
తాజాగా బిగ్ బాస్ సెంకడ్ డేకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే హౌజ్ లో ఎవరితో ఎక్కువగా కలవని మణికంఠ హాయిగా సోఫాలో నిద్రపోయాడు. కుక్కలు అరవడంతో హౌస్ మెట్స్ మొత్తం అతడి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక నామినేషన్ లో నబీల్ అఫ్రిది ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేశాడు.
మణికంఠ ఎప్పుడూ ఒంటరిగానే ఉంటున్నాడని.. కెమెరాతో మాట్లాడుతున్నాడంటూ అఫ్రిది రీజన్స్ చెప్పగా ఒంటరిగా కూర్చుని పాటలు పాడుతున్నానంటూ మణికంఠ చెప్పుకొచ్చాడు. మనం ఇక్కడికి వచ్చింది పాటలు పాడటానికి కాదు కదా బ్రో అంటూ వెంటనే కౌంటర్ ఇచ్చాడు అఫ్రిది. ఇక శేఖర్ బాషా కూడా బేబక్కతో పాటుగా మణికంఠను నామినేట్ చేశాడు.
మణికంఠ వచ్చినప్పటినుంచి ఒంటరిగానే ఉండటం, విచిత్రంగా మాట్లాడుతుండటంతో అతన్ని సోషల్ మీడియాలో కూడా బాగానే ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సీజన్ లో సింగర్ లేని లోటును మణికంఠ తీరుస్తున్నాడని.. ఏదో వంద సంవత్సరాలు లైఫ్ లీడ్ చేసినోడిలా బిల్డప్ ఇస్తున్నాడంటూ గట్టిగానే వేసుకుంటున్నారు. ఇక మరికొందరు అయితే నాగార్జున గారూ ముందు ఈ మణికంఠను ఎలిమినేట్ చేయండి సార్ .. భరించలేకపోతున్నమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Singer category lo ee sari evarini pilavaledu enta ani anukuna..
Rendu episodes ayaka telisindhi.. Singer leni lotu ma #nagamanikanta teerustunadu ee season lo ani 😂#BiggbossTelugu8 pic.twitter.com/WvkCXpP1df
— Troller (@BBEight_Troller) September 3, 2024
#NagaManikanta eedenti konchem thedaga vunnadu
Edo 100years life lead chesi anni chusesinattu buildup isthunnadu#BiggBossTelugu8 pic.twitter.com/zCjzuYova8— シータラム ᴰᴱⱽᴬᴿᴬᵒⁿˢᵉᵖ²⁷ (@kmsram1997) September 3, 2024



