అన్నయ్యను ఎవరూ గెంటేయలేదు.. ఆయనవన్నీ సొంత నిర్ణయాలే : నాగమణికంఠ సిస్టర్ పోస్ట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. 14 మందితో మొదలైన ఈ సీజన్ కు ఐదోసారి హోస్ట్ గా నాగార్జుననే చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. 14 మందితో మొదలైన ఈ సీజన్ కు ఐదోసారి హోస్ట్ గా నాగార్జుననే చేస్తున్నారు. హౌస్ లో ఉన్న14 మంది కంటెస్టెంట్స్‌లో నాగమణికంఠ ఒకరు. సీరియల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన మణికంఠ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బిగ్ బాస్ ఎంట్రీలో తన గురించి మణికంఠ చెప్పుకొచ్చాడు. తనకు రెండేళ్ల వయసున్నప్పుడే తన తండ్రి చనిపోయారని.. తల్లికి మరో పెళ్లి జరిగినట్లుగా తెలిపాడు. వయసువచ్చాక స్టెప్‌ఫాదర్ తన తండ్రి అని తెలియడంతో యాక్సెప్ట్ చేయలేకపోయానని, తర్వాత కొన్నాళ్లుకు తల్లి క్యాన్సర్ తో మరణించిందని తెలిపాడు మణికంఠ. ఆ తర్వాత తాను ఫారెన్ వెళ్లడం, పెళ్లి చేసుకోవడం, పాపకు తండ్రి అవ్వడం అన్ని చెప్పుకొచ్చారు. అయితే స్టేజి పైన మణికంఠ చెప్పిన కొన్ని మాటలపై అతని చెల్లి కావ్య ఇన్ స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చింది.
మా నాన్న గురించి అన్నయ్య స్టెప్ ఫాదర్ అని చెప్పారు. అది అతను నెగిటివ్ వేలో చెప్పలేదు, కేవలం అతని విషయాలను చెప్పుకొచ్చారు.. అలాగే మా అమ్మ తదనంతరం అయన ఇంటి నుంచి వెళ్లిపోయారు.. అతన్ని ఎవరు ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు, అది పూర్తిగా అయన సొంత నిర్ణయమేనని కావ్య చెప్పింది. తన తండ్రి అన్నయ్యకు ఎప్పుడూ సపోర్ట్ గానే నిలిచారని తెలిపింది. తమ ఇద్దరి జీవితాలకు కావాల్సినంత ప్రేమను అందించారంది కావ్య. అన్నయ్య మాట్లాడిన మాటలు పూర్తిగా అయన వ్యక్తిగతమని కావ్య క్లారిటీ ఇచ్చింది. అయన డెసిషన్స్ కు తాము రెస్పెక్ట్ ఇస్తామంది. కుటుంబాలు వివిధ రకాలుగా ఉంటాయి, అవి ఎలా ఫామ్ అయినా కుటుంబమే.. దయచేసి తన అన్నయ్య మాటలపై నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని… తమ ఫ్యామిలీ ఆ మాటలకు ఇబ్బంది పడుతుందని తెలిపింది. దయచేసి తన అన్నయ్యకు సపోర్ట్ చేయండంటూ కావ్య తన పోస్టులో చెప్పుకొచ్చింది.




