మంచు ఫ్యామిలీలో మంటలు.. తన్నుకున్న తండ్రి కొడుకులు
టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం గొడవపడి కొట్టుకునే స్థాయి వరకు వెళ్లినట్లు తెలిసింది. ఆ
పల్లవి, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం గొడవపడి కొట్టుకునే స్థాయి వరకు వెళ్లినట్లు తెలిసింది. ఆ గొడవలో మంచు మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన తన భార్య మౌనికతో కలిసి చికిత్స కోసం బంజారాహిల్స్ లోని ఓ హాస్పిటల్ కు నడవలేని స్థితిలో వెళ్లారు. ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
మంచు మనోజ్ ని మంచు మోహన్ బాబు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంచుతున్నారని, ఆస్తుల విషయంలో విభేదాలు మొదలయ్యాయని ఇప్పటికే పలు వార్తలు బలంగా వైరల్ అయ్యాయి. ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి డయల్100కు ఫోన్ చేసి ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ తనపై అలాగే తన భార్య మౌనిక రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లు వార్తలు బయటకొచ్చాయి. ఈ వార్తలను మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నిరాధార కథనాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేసింది.
పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది. అయితే ఇదంతా జరిగిన కొద్ది సేపటికే.. మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్ లో చేరిన వీడియోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ నిజమేననే విషయం స్పష్టమైంది. హాస్పిటల్ లో చికిత్స తర్వాత మంచు మనోజ్ ఆ రిపోర్టులతో వెళ్లి పహడీషరీప్ పోలీస్ స్టేషన్ లో దాడికి సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మంచు కుటుంబంలో మరో వివాదం అటు టాలీవుడ్ లో ఇటు రాష్ట్రంలో సంచలనంగా మారింది.



