Allu Arjun : అల్లు అర్జున్‌కు ఆ నాలుగు చూపించిన రేవంత్ సర్కార్
Allu Arjun : ఈ అరెస్ట్ తో రేవంత్ సర్కార్ పుణ్యాన జీవితంలో ఎప్పుడు చూడని నాలుగు ప్లేస్ లను అల్లు అర్జున్ చూసేశాడు. అందులో మొదటిది చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్.

Allu Arjun : పుష్ప 2 రిలీజ్ కు ముందు ఎంత ట్రెండ్ అయిందో రిలీజ్ అయ్యాక అంత సెన్సెషన్ అయింది. కారణం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటే. రేవతి అనే మహిళ మృతి చెందడం.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడం.. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు బన్నీ అరెస్ట్ దేశవ్యాప్తంగా పెద్ద ట్రెండ్ అయింది.
ఈ అరెస్ట్ తో రేవంత్ సర్కార్ పుణ్యాన జీవితంలో ఎప్పుడు చూడని నాలుగు ప్లేస్ లను అల్లు అర్జున్ చూసేశాడు. అందులో మొదటిది చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్. పుష్ప 2లో అల్లు అర్జున్ తన సహచరులను విడిపించడానికి ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ లోని పోలీసులను కొంటాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం తన అభిమాని అయిన సీఐ చేతిలోనే బన్నీ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
ఇక రెండోది గాంధీ ఆసుపత్రి. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే స్టార్ కిడ్ . సాధారణంగా స్టార్ లకు ఏ చిన్న గాయం జరిగిన సరే డాక్టర్సే ఇంటికి రావడం లేదా.. బడా ఆసుపత్రులకు వెళ్తుంటారు. బన్నీ అరెస్ట్ తరువాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇంతవరకు బన్నీ గాంధీ ఆసుపత్రికి వెళ్లింది లేదు.
ఇక మూడోది నాంపల్లి కోర్టు. బహుశా బన్నీకి ఇదోక కోర్టు ఉందని కూడా తెలిసుండకపోవచ్చు. పోలీసుల ఫార్మిలిటిస్ ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని వైద్య పరీక్షలు తర్వాత కోర్టుకు తరలించాల్సి ఉంటుంది. అలా బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. అక్కడ వాదనలు ముగిశాక బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
ఇక నాలుగోది చంచల్ గూడ జైలు. కోర్టు రిమాండ్ మేరకు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ జైలు ఫార్మలిటిస్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో రాత్రంతా జైల్లోనే గడిపాడు బన్నీ. దాదాపు 12 గంటల జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ ఓ సాధరణ ఖైదీ లాగే నేలపై పడుకున్నాడు. ఎంతైనా రీల్ లైఫ్ వేరు… రీయల్ లైఫ్ వేరు కదా ఫుష్ప.
Related News
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం..!
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన