సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిర్యాదు

సినిమా రివ్యూలు రాసే వారిపై దుర్భాషలాడారంటూ శ్రీకాంత్ అయ్యంగార్పై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది అసోసియేషన్. ‘పొట్టేల్’ సినిమా రివ్యూల విషయంలో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్. సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పొట్టెల్ సక్సెస్ మీట్ సందర్బంగా సినిమా రివ్యూస్ రాసేవాళ్లు పెంట కన్నా దరిద్రులు అంటూ దారుణంగా తిట్టాడు.
శ్రీకాంత్ మాట్లాడిన మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినంగా విధంగా ఉన్నాయని.. ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా తొక్కలో రివ్యూలు అంటూ నీచంగా మాట్లాడాడు. షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం రాని వాళ్లు రివ్యూలు రాస్తున్నారు అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేశాడు. నోటికి అడ్డూ అదుపు అనేది లేకుండా చాలా దారుణంగా మాట్లాడేశాడు. ఇక ఈ రివ్యూలను కూడా ఆపేయాలన్నట్టుగా ఆయన మాట్లాడాడు. శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.