ఆ సినిమా ఎందుకు చేశానా అనిపించింది: ఫహద్ ఫాజిల్
మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ అసలు ఆ సినిమా ఎందుకు చేశానా అని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ అసలు ఆ సినిమా ఎందుకు చేశానా అని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. ఇక అసలు విషయం ఏంటంటే “ఫహద్ ఫాజిల్ ఉదయనిధి స్టాలిన్ హీరోగా వచ్చిన మామన్నన్ సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర గురించి ఫహద్ మాట్లాడుతూ
“మామన్నన్ కథ నచ్చే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. కానీ, విడుదల తరువాత అసలు ఎందుకు చేశానా అని బాధపడ్డాను. నిజానికి నాకు కుక్కలంటే ఇష్టం. కానీ ఆ సినిమాలో కుక్కల్ని అతి క్రూరంగా చంపుతాను. ఒక సమయంలో నా పాత్ర చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రెజెంట్ ఆయన విలన్ గా చేసిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.