ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పుష్ప -2 మూవీ

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ పుష్ప -2 చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పే ” గంగమ్మ జాతరలో పొట్టేల్ తలలు నరికినట్లు అందర్నీ రపా.. రపా.. నరుకుతా “అనే డైలాగ్ ఆ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది.
పల్నాడులోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొంతమంది కార్యకర్తలు పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ తో ప్లేక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.
ఈ ప్లకార్డులపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఉన్మాదానికి తావులేదంటూ అతడిని అరెస్ట్ చేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” ఎవర్ని నరుకుతారు ప్రజలను నరుకుతారా.?. ఐదేండ్లు మీ అరాచక పాలనను ప్రజలు బొందపెట్టినందుకు ఈ శిక్ష వేస్తారా..?. తప్పు చేస్తే ఎవర్ని వదిలిపెట్టను. ప్రజలజోలికి వస్తే ఊరుకోను. తాట తీస్తాను అని ” వార్నింగ్ ఇచ్చారు.
Related News
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
కవితకు హరీశ్ కౌంటర్
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి