గద్దర్ అవార్డుల వేడుకల్లో అరుదైన సంఘటన..!

పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్న గద్ధర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.
ఈ వేడుకలకు హజరైన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి , ప్రముఖ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను కలుస్తూ పలకరిస్తూ ముందుకు వెళ్ళసాగారు.
ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఐకాన్ స్టార్ బన్నీని పలకరించి మరి హగ్ చేసుకున్నారు. ఇటీవల పుష్ప -2 మూవీకి ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్న బన్నీని అభినందించారు.
కాగా, గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరిగిన పుష్ప – 2 మూవీ విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లిన సంగతి తెల్సిందే.